Header Banner

ఈశాన్యంలో జలవిలయం! అస్సాం సిల్చార్‌లో 132 ఏళ్ల రికార్డు బద్దలు!

  Mon Jun 02, 2025 10:15        India

జూన్ నెల ప్రారంభం నుంచే ఈశాన్య భారతదేశంలో వర్షాలు విరుచుకుపడుతున్నాయి. అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం వంటి రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సాధారణ జీవితం స్తంభించింది. అస్సాంలోని సిల్చార్ నగరంలో జూన్ 1న కేవలం 24 గంటల్లో 415.8 మి.మీ వర్షపాతం నమోదై 132 ఏళ్ల రికార్డును బద్దలు చేసింది. 1893లో నమోదైన 290.3 మి.మీ రికార్డు ఇప్పుడిది దాటింది. వాతావరణ శాఖ ప్రకారం, ఉపరితల ఆవర్తనాలు మరియు తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి విస్తరించిన అల్పపీడన ద్రోణుల ప్రభావంతో అస్థిర వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల కారణంగా గత మూడు రోజుల్లో కనీసం 34 మంది మరణించారు.

 

మేఘాలయ, త్రిపుర, మణిపూర్‌లో భారీ నష్టం – సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
మేఘాలయలో మే 28 నుండి జూన్ 1 వరకు ఎడతెరిపిలేని వర్షాలతో సోహ్రా, మాసిన్రామ్‌లో వరుసగా 796 మి.మీ. మరియు 774.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖ్లీహ్రియాత్, ఆర్‌కేఎం సోహ్రా, పైనూర్స్లా వంటి ప్రాంతాల్లో 500 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. మే 30న ఒక్క రోజులోనే ఆర్‌కేఎం సోహ్రాలో 378.4 మి.మీ వర్షం పడగా, ఐదు రోజుల్లో మొత్తం 993.6 మి.మీ. వర్షం నమోదైంది. త్రిపురలో ఆకస్మిక వరదలతో 10,000 మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మణిపూర్‌లో నదులు ఉప్పొంగి, కట్టలు తెగిపోవడంతో 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. మొత్తం 3,365 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NortheastFloods #AssamFloods #SilcharRainfall #132YearRecord #HeavyRainfall #Monsoon2025 #NaturalDisaste